Whipped Running Stitch
టాకా కుట్టులో Whipped Running Stitch చూడండి.
ముందుగా ఒక రంగు దారంతో టాకా కుట్టు కుట్టాలి. తరువాత వేరే రంగు(కాంట్రాస్ట్ కానీ లేదా ముదురు లేత గాని) దారం తీసుకుని మొదటి
టాకా కుట్టు దగ్గరగా బట్ట అడుగునుండి పైకి తీసి ఒక కుట్టు నుండి పైకి తరువాతి కుట్టునుండి క్రిందికి దురుస్తూ (బట్ట లో నుండి దూర్చ కూడదు) పైన చూపిన విధంగా దూర్చి చిట్ట చివరి టాకా కుట్టు దగ్గరగా బట్ట అడుగు భాగానికి దించి ముడి వేయాలి.
ఈ కుట్టుని బార్డర్, అవుట్ లైన్ లా వాడుకోవచ్చు. పిల్లల ఫ్రాక్స్, దిండు గలేబులు, టేబుల్ మాట్స్, టవల్స్, కిచెన్ లినెన్ ఇలా వేటిమిదనైన వాడ వచ్చు.
ఈ కుట్టుని బార్డర్, అవుట్ లైన్ లా వాడుకోవచ్చు. పిల్లల ఫ్రాక్స్, దిండు గలేబులు, టేబుల్ మాట్స్, టవల్స్, కిచెన్ లినెన్ ఇలా వేటిమిదనైన వాడ వచ్చు.
ఇలా ఈ కుట్టుని చాల రకాలుగా కుట్టవచ్చు మన సృజనను బట్టి. వచ్చే టపాలలో ఇంకొన్ని...
No comments:
Post a Comment