Tuesday 3 April 2012

వెనుక కుట్టు -Back Stitch-1

వెనుక  కుట్టు -Back Stitch 

ఈ కుట్టు టాకా కుట్టు  కుట్టులాగే ఉంటుంది. కాని వెనుకకి కుడతారు. కుట్టుకి కుట్టికి మధ్య ఎడం లేకుండా కుట్ట వచ్చు. కావాలనుకుంట కుట్టు కుట్టుకీ  మధ్యన కావాలనుకుంటే ఎడం ఉంచవచ్చు. 

ఎలా కుడతారో చూద్దాం

 A నుండి  దారం  బట్ట  క్రింది  నుండి  పైకి  తీయాలి 
A కి కొద్దిగా వెనుకన B నుండి  క్రిందికి  తీసి  మరల C దగ్గెర  పైకి తీయాలి  
C నుండి  మరల  A దగ్గెర  క్రిందికి దించాలి. ఇలా అన్ని కుట్లు వెనుకకి కుట్టుకోవాలి.  

అన్ని కుట్లు ఒకే పొడవు ఉంటే బాగుంటాయి. లేదా ఒక పద్దతిగా పొడుగు పోటి తో డిజైన్ కుట్ట వచ్చు.

ఈ కుట్టు outline  లాగా వాడుకోవచ్చు. Cross Stitch, Assisi Embroidery, Black Work లలో వాడతారు. 


మీ...అనామిక....

No comments: