Monday 11 June 2012

అమ్మమ్మ చిట్కాలు-5

వాడేసిన టూత్  బ్రష్షుల తో ...

మీకు  తెలుసా? మనం పళ్ళు తోముకోవడానికి వాడే  బ్రష్  3 నెలలకొకసారి, మార్చుకోవలట. అధమం 6 నెలలకైన కొత్తవి వాడాలి. ఇలా వాడేసి పడేసే   బ్రష్లు వేల/లక్షల సంఖ్యలో ఉంటాయి. అవి ప్లాస్టిక్ తో చేసినవి. మరి పర్యావరణానికి  హాని చేస్తాయి. అందుకని, తీసి వేసిన   బ్రష్లను మనం వెంటనే పారేయకుండా వాటికి వాడుకోవచ్చును.

ముందుగా అలాంటి వాడేసిన  బ్రష్లను వేడినీటిలో కొంచం సబ్బు, dettol  వేసి 10 ని. నానపెట్టి బాగా కడిగి ఆరనివ్వండి. తరువాత ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి మీ పనిముట్లు పెట్టుకునే టూల్ కిట్ లో పెట్టుకోండి. 

బ్రష్లను ఈ క్రింది వాటిని శుభ్రం చేయటానికి ఉపయోగించుకో వచ్చును:
  1. వంట ఇంట్లో, స్నానాల గది లోను టైల్స్ మధ్యన, గోడ మూలలోను 
  2. వంట ఇంట్లో, స్నానాల గది లోను సింకు పంపుల దగ్గెర, సింకుకి గోడకి మధ్యన వేసిన తెల్ల సిమెంటు దగ్గెర  
  3. దువ్వెనలు   
  4. పని ముట్లను  
  5. తురుము పీట  
  6. కిటికీల ద్వారాల తలుపులూ  గ్రిల్లు, అద్దాల/చెక్క మూలాలను    
  7. సున్నితమైన electronic వస్తువులు   (మెత్తని బేబి   బ్రష్  )
  8. కంప్యూటర్ కీ  బోర్డు  
  9. బంగారం, వెండి నగలు, వెండి వస్తువులు, రాళ్ళూ పొదిగిన నగలు 
  10. చేయి  పట్టని, సన్నని మూతి గల సీసాలు, పాల  సీసాలు, డబ్బాలు  
  11. షూ లకు, పాలిష్ వేసేటప్పుడు, అంచుల దగ్గెర పాలిష్ రాయటానికి (మాములు బ్రష్  తో వేయటం కష్టం)
  12. షూ క్లీనింగ్ - మట్టి బురద వంటివి అత్తుక్కు పోయినప్పుడు 
  13. బట్టలు, స్వెటర్లు, కోట్లు, ఫర్నీచర్, కార్పట్  వంటి వాటి మీద మరకలు పడి నప్పుడు, ముందుగా  ఆ ప్రాంతం మాత్రం శుభ్రం చేయాలి. అలా స్పాట్  క్లీనింగ్ చేసేటప్పుడు 
  14. తలుపులకి కిటికీలకి పెయింటు వేస్తూనప్పుడు, చిన్న డబ్బాలైతే పెయింటు బాగా కలపడానికి 
  15. చిత్రకళ లో టూత్ బ్రష్ టెక్నిక్ ఉపయోగించి వెరైటి గా వేయోచ్చును 
  16. చిన్న పెద్ద బొమ్మలు -మట్టి, పింగాణి, గుడ్డతో (ఫర్ కాదు ) కుట్టినవి మెత్తని బేబి బ్రష్ తో సున్నితంగా క్లీన్ చేయ వచ్చు 
  17. చేతులు/పెద్ద బ్రష్ దూరని చోట్లు  శుభ్రం చేయటానికి
  18. అల్లం, దుంప కూరలు, ఇతర కూరలు, పళ్ళు  శుభ్రం చేయటానికి మెత్తని బ్రష్ వాడవచ్చు 
  19. మానిక్యుర్,  పెడిక్యుర్ కి, గోళ్ళు  శుభ్రం చేయటానికి
  20. కనుబొమ్మలు సరి చేయటానికి, మేకప్ వేసుకోవటానికి 
  21. ఏసి   శుభ్రం చేయటానికి
  22. వైరు మెష్  శుభ్రం చేయటానికి
  23. సైకిల్ చైన్   శుభ్రం చేయటానికి
  24. టూత్ బ్రష్  హండిల్ ను కోవత్తి పై  కాల్చి విరిగిన/కారుతున్న బకెట్లు వంటి వాటికి మాట్లు వేసుకోవచ్చును 
  25. కాలిలో లేదా చేతులలో ముళ్ళు/ చెక్క పేడు గుచ్చుకున్నప్పుడు , ఆ భాగం పై బ్రష్ తో బ్రష్ చేసి ముల్లును తీసివేయవచ్చును 
ఇలా ఎన్నో ఉపయోగాలు, మరి మీకూ  ఇంకా ఎవైనా తెలిస్తే నాకు మెయిల్ చేయండి. అందరితో పంచుకోవచ్చు....



మీ...అనామిక....

3 comments:

Meraj Fathima said...

సర్ నిజంగా ఎన్ని చిట్కాలో ఉపయోగామైనవే , ధన్యవాదాలు.

అనామిక... said...

thanks andi meraj fathima gaaru

రసజ్ఞ said...

వాటిని నేను దువ్వెన్నలు క్లీన్ చేయటానికి వాడతా కానీ ఇన్ని రకాలుగానా!!!!!! ఈ సారి ట్రై చేస్తా.