Sunday 23 September 2012

గొలుసు కుట్టు -Chain Stitch-11

Braided Chain Stitch 

ముందుగా కావలసిన విధంగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి. 
తరువాత వేరే రంగు(నారింజ రంగు) దారాన్ని( గొలుసు కుట్టు ప్రారంభించిన చోట ఇలా బట్ట పైకి తీసుకోవాలి. 
 
 రెండోవ గొలుసు లోకి దూర్చాలి. బట్టలోకి మాత్రం దూర్చ కూడదు. 
ఇప్పుడు మళ్ళి మొదటి గొలుసు లోంచి, ఇంతకు ముందు వేసిన లూప్ అడుగు నుండి తీయాలి.
 ఇలా కనిపించాలి.
 ఇలా అన్ని గోలుసులలోంచి దారాని లేసు లాగా అల్లాలి.
చివరికి వచ్చినప్పుడు పధ్ధతి ప్రకారం అయితే ఇక్కడ దారాన్ని(నారింజ రంగు) బట్టలోకి దించి వేయాలి. మళ్లి పై వైపు మొదటి(ముందుగ మనం మొదలు పెట్టినది) నుండి మొదలు పెట్టుకోవాలి.
కాని నేను ఇలా నారింజ రంగు దారాన్ని, నల్ల దారం గుండా దూర్చి (బట్టలోకి దూర్చ కుండా) కుట్టుని తలక్రిందలుగా (పై వైపు క్రిందికి వచ్చేటట్లుగా) పట్టుకుని మరల అటు నుండి లేసు అల్లి మొదటికి వచ్చాను. 
చివరన దారాన్ని బాట్ట అడుగుకి దింపి ముడి వేసుకోవాలి. 
ఇలా ఈ కుట్టు పూర్తీ అయినట్లే. కాని ఈ లేసు ఉతికేటప్పుడు లేదా ఇస్త్రి చేసే టప్పుడు చెదిరి పోకుండా ఉండాలంటే ఇలా క్రింద చూపిన విధంగా టాకాలు  వేస్తే అందంగా కూడా ఉంటుంది. టాకాలు సమంగా రావాలి.
లాసు అల్లేందుకు  జరి దారం వాడితే చాలా  బాగుంటుంది. 

ఇంకొన్ని తరువాతి టపాలలో....
మీ...అనామిక....

అందం పుట్టిన రోజు

మొన్న వినాయక చవితి నాడు, నేను ఉదయాన్నే ఇలా సీతాకోక చిలక పుట్టుక చూసాను. వెంటనే కేమెరా లో బంధించాను.
తరువాత సాయంత్రానికి ఆ సీతాకోక చిలక ఇలా కనిపించింది. అంతేనా, అది మా తోటలోని పువ్వులను పలకరిస్తో ఉంటే  చాలా సేపు చూసి ఆనందించాను. ఐతే ఇంకా మళ్లి నా కెమేరాకు చిక్కలేదు.
భగవంతుని సృష్టి ఎంత అందమైనదో కదా....

మీ...అనామిక....

Thursday 20 September 2012

గోలుసు కుట్టు- Chain Stitch-10


Checkered Chain Stitch or Magic Chain Stitch

ఈ కుట్టు పేరుకు  తగ్గట్లుగానే ఉంటుంది. అంతా గొలుసు కుట్టు లాగానే కుట్టాలి. కాని రెండు వేర్వేరు రంగు దారాలను ఒకే సుదిలోకి ఎక్కించు కోండి. నేను ముదురు-లేత గులాబీ రంగు దారాలను వాడాను.
ముందుగా సూది ని  బట్ట అడుగు నుండి పైకి తీసుకోండి.
మాములు గొలుసు కుట్టు లాగానే కుట్టండి. కాని దారాన్ని లూప్ (సూది చుట్టూ) వేసినప్పుడు ఒక రంగు దారాన్ని మాత్రమే వేయండి. సూదిని పైకి లాగండి. 
 ఒక గొలుసు ఇలా రావాలి.
ఇప్పుడు రెండో గొలుసు కుట్టేటప్పుడు రెండో రంగు దారాన్ని వాడండి. ఇలా మొత్తం కుట్టేటప్పుడు ఒకొక్క రంగు దారాన్ని ఒకొక్క గోలుసుకి ఒకదాని తరువాత ఒకటి వాడండి. 
కుట్టు చివరన మాములు గొలుసు కుట్టుకి మాదిరి దారాన్ని బాట పైనుండి అడుగుకి దించి, ముడి వేయండి.

ఇలా ఒక దాని తరువాత ఒకటి కాకుండా 2/3 ఒకే రంగు గొలుసులు కుట్టి తరువాత 2/3 వేరే రంగువి ఇలా రక రకాలుగా కుట్టుకోవచ్చును. 

దారం తక్కువ పోచలు వాడినా లేదా సన్ననిది అయితే రెండు కంటే ఎక్కువ రంగులు వాడవచ్చు. కాని కుట్టేటప్పుడు దారం చిక్కు పడకుండా జాగ్రత్త పడాలి. 

ఇది ఫిల్లింగ్ కుట్టు లాగా కాని లేదా అవుట్ లైన్ లాగా కాని లేదా బోర్డర్ లాగా కాని, వేరే కుట్లతో కలిపి కాని వాడుకోవచ్చును.

మీ...అనామిక....

Tuesday 18 September 2012

రంగవల్లి -92

వినాయక చవితి స్పెషల్-పూల  పందిరి 
21 చుక్కలు 7 వరుసలు.. 7 వరకు, ఎదురు చుక్క 


మీ...అనామిక....

రంగవల్లి-91

వినాయక చవితి స్పెషల్ 

23 చుక్కలు...1 వరకు, ఎదురు చుక్క 
ఉండ్రాళ్ళు, లడ్డూలు, స్వస్తిక ఇవి వినాయకుడికి ఇష్టమైనవి. మరి వేసి చూడండీ .


మీ...అనామిక....

రంగవల్లి - 90

వినాయక చవితి స్పెషల్ 

19 న వినాయక చవితి పండగ వస్తోంది. నాకు చిన్నప్పటి నుండి, వినాయకుడు అంటే చాలా ఇష్టం . అసలు ఈ పండగ అంటే  చాలా సరదాగా ఉంటుంది. 21 పత్రాలతో పూజ, ఉండ్రాళ్ళు, జిల్లేడి కాయలు, కుడుములు వంటి ప్రసాదాలు, మొక్కజొన్న పొత్తులు, సీతాఫలాలు ఇంకా ఎన్నో...  పుస్తకాలు స్వామీ పక్కన ఉంచి పూజ చేసుకోవటం.....భలేగా ఉంటుంది. అన్నిటి కంటే పోటీలు పడి మరీ  పాల వెల్లి అలంకరించటం, స్వామిని ఉంచే మందిరాన్ని అలంకరించటం ఇలా ఎన్నో మధుర స్మృతులు.

సరే మరి నాకు చాలా ఇష్టమైన దేవుళ్లలో వినాయకుడు ఒకరు. మరి అందుకనే ఈ పండగ కి కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు మీ కోసం :
19 చుక్కలు 3 వరుసలు, సరి చుక్క 3 వరకు. 

ఇంకా కొన్ని వచ్చే టపాలలో....

మీ...అనామిక....

Saturday 15 September 2012

రంగవల్లి -89

16 చుక్కలు-2 వరుసలు. 14, 12......2 వరకు. చాలా సుళువైన ముగ్గు.

మీ...అనామిక....

రంగవల్లి-88

కుందన్ తో రంగవల్లి...Reusable Rangavalli-3

అడుగున OHP sheet పైన కుంద న్లు అతికించాను. అతికించటానికి ఫెవికోల్ లాంటివి వాడుకోవచ్చు. కుందన్ లో నెమలి (ఆకుపచ్చ రంగువి)  వాడాను .

ఈ డిజైన్లు మీకు నచ్చాయి అనుకుంటాను. ఇంతకూ ముందు చెప్పుకున్నట్లు, నేల  మిద కాని టేబుల్ మీదా కాని ఈ షీట్ పెట్టుకోవచ్చు. అడుగున ఏదైనా నప్పే రంగు ఉన్న కాగితం కాని లేదా గుడ్డ కాని పరిచి దాని పై ఈ రంగోలి షీట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సాటిన్ లేదా వెల్వెట్ గుడ్డ లేదా సిల్క్ అయినా మరింత రిచ్చ్ గా ఉంటుంది 


మీ...అనామిక....

Friday 14 September 2012

Wednesday 12 September 2012

గొలుసు కుట్టు -Chain Stitch-9

Long-Armed Detached Chain Stitch
ఇది Detached Chain Stitch లో ఒక రకం. ఇందులో గొలుసు కుట్టిన తరువాత దారం గోలుసుకి దెగ్గరగా కాకుండా మనకు కావలసినంత దూరం లో బట్ట క్రిందికి దించాలి. కాని మరి పొడువు ఉంటే, కుట్టు వదులుగా ఉండి సరిగ్గా నిలవదు. 

ఈ కుట్టు పూవులు, ఆకులు వంటివి కుట్టటానికి పనికి వస్తుంది. అలాగే వేరే కుట్లతో కలిపి కుట్టుకోవచ్చును. 

మీకు ఈ టపాలు నచ్చుతున్నాయని ఆశిస్తున్న. సుళువుగా అర్ధం అవుతున్నాయని అనుకుంటున్నా. 

ఇంకొన్ని గొలుసు కుట్టు రకాలు వచ్చే టపాలలో....
మీ...అనామిక....

రంగవల్లి -86

పూల  పందిరి 
20 చుక్కలు 2 వరుసలు, 2 వరకు. సరి చుక్క.

మరి వినాయకుడికి పూల  పందిరి వేద్దామా?

మీ...అనామిక....

Sunday 9 September 2012

గొలుసు కుట్టు -Chain Stitch-8

Russian Chain Stitch

ఈ కుట్టులో ముడేసి విడి విడి గొలుసులు త్రిభుజాకారం లో కుడతారు. ఇవి వరుసగా ఒక దాని క్రింద ఒకటి కానీ, లేదా ఒక వరుసలో కాని కుడతారు.
ఈ కుట్టు బార్డర్ లాగా కుట్టటానికి కాని లేదా బూటిలుగా కుట్టటానికి ఉపయోగించవచ్చు.


మీ...అనామిక....

Saturday 8 September 2012

పల్లవి- అనుపల్లవి

పాటంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? మంచి పాటను వింటే మనసు కరగని వారు ఉంటారా? ఈ పాట నాకు చాలా ఇష్టం 

చిత్రం: పెళ్లి కానుక 
తార గణం: అక్కినేని నాగేశ్వర రావు, బి. సరోజా దేవి, కృష్ణ కుమారి
రచన: ఆచార్య ఆత్రేయ
గాయకులూ : జిక్కి
స్వరకల్పన: ఎ. ఎం. రాజా


పులకించని మది పులకించు
వినిపించని కధ వినిపించు
కనిపించని ఆశల నించు
మనసునే మరపించు
గానం మనసునే మరపించు (పులకించని)(2)

రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం(2)
రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం
చెదరిపొయే భావములను చేర్చి కూర్చును గానం
జీవమొసగును గానం మదీ చింత బాపును గానం (పులకించని)

వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును (2)
కూలిపోయిన తీగలైనా కొమ్మనలమీ ప్రాకును
కన్నెమనసు ఎన్నుకొన్నా తోడు దొరికిన మురియు
దోరవలపే కురియు, మదీ దోచుకొమ్మని పిలుచు (పులకించని)

మనసునే మరపించు ప్రేమా మనసునే మరపించు

మీ...అనామిక....

గొలుసు కుట్టు -Chain Stitch-7

Slipped Detached Chain Stitch-Tulip Stitch

ఇది కూడా గొలుసు కుట్టు కుటుంబానికి చెందినదే. ఇది "ట్యులిప్ " పువ్వు లాగ ఉంటుందని ట్యులిప్ కుట్టు అని కుడా అంటారు.
  ముందుగా ఒక single chain stitch కుట్టుకోవాలి.
తరువాత A నుండి దారం బట్ట అడుగు నుండి పైకి తీయాలి.  పైన చూపిన విధంగా కుట్టులోనుండి దూర్చి, B దెగ్గర క్రిందికి దింపాలి. తరువాత C నుండి D కి అదే విధంగా కుట్టాలి. 2 లో చూపింది ట్యులిప్  కుట్టు. తరువాతివి ఆ కుట్టు లో రకాలు. 
ఈ కుట్టు పువ్వులాగా ఉంటుంది. బుటీలుగా లేదా ఇతర కూట్ల తో కలిపి కుట్టుకోవచ్చు. అవి తరువాత వివరంగా చెప్పుకుందాం.

గొలుసు కుట్టుకి చెందినవి ఇంకా అనేకం ఉన్నాయి. నా తరువాతి టపాలలో చూడండి 

మీ...అనామిక....

Friday 7 September 2012

రంగవల్లి-85

కుందన్ తో రంగవల్లి...Reusable Rangavalli-2

ఇవి చూడండి. ప్లాస్టిక్ OHP sheet పైన కుందన్ అతికించాను. ఈ షీట్ మందంగా ఉంటుంది కాబట్టి సులభంగా ముగ్గు (కుందన్) అతికించుకుని పెట్టుకోవచ్చు.

అడుగున వేరు వేరు రంగు కాగితాలు పెట్టినా, లేదా టేబుల్ మీద  అయితే టాబుల్ క్లాత్ రంగులు back ground రంగులుగా కనిపిస్తాయి. మనం ఇలా అడుగున రంగు మార్చుకుంటే కొత్తగా అనిపిస్తుంది. నేలపైన పెట్టుకుంటే అసలు నేలపైన వేసినట్లుగానే ఉంటుంది. దెగ్గరగా చుస్తే కాని తెలియదు.

ఇంకొన్ని డిజైన్లు వచ్చే టపాలలో...
మీ...అనామిక....