Thursday 30 May 2013

అమ్మమ్మ చిట్కాలు - 8


పాత దిండు గలేబుల తో ..... 2

  • గాజు/పింగాణి సామాను గాలేబులలో చుట్టి భద్ర పరుస్తే గీతలు  పడకుండా ఉంటాయి. 
  • వెండి వస్తువులు గీతలు  పడకుండా భద్ర పర్చుకొవచ్చును. 
  • పిల్లల బొమ్మలు, ఆడిన తరువాత గలేబులో వేసి భద్ర పరచ వచ్చు 
  • నవారు కాని, గుడ్డ ముక్కలతో టేపు లాగా కుట్టి కాని, గాలేబులకు హ్యాండిల్ లాగా కుట్టి సంచీల లాగా వాడుకోవచ్చును. ఎక్కువ బరువు ఉండవు. మనం కూరలు/పళ్ళు/సరుకులు  తెచ్చుకొవచ్చు. ప్లాస్టిక్ సంచులు  వాడనవసరం  లేదు.
  •  గళ్ళు ఇతర ప్రింట్ ఉన్నవి లేదా ఎంబ్రాయిడరి  చేసిన గాలేబులయితే  ఇలా సంచులుగా బాగుంటాయి. ఓపిక ఉంటే అందంగా బ్యాగ్ లు కుట్టు కొవచ్చును. 
  • కొత్తవి, వాడనివి, అందంగా ఉన్న గలేబులతో పిల్లల స్కర్ట్లు, టాప్స్, నైటీలు  కూడా కుట్టు కొవచ్చును. స్ట్రాప్ లు, జిప్పులు, బటన్లు , రిబ్బన్లు, లేదా అందమైన పువ్వులు, లతలు కుట్టి కాని, పెయింట్ చేసి కాని పిల్లల దుస్తులు కుట్ట వచ్చును. ఈ క్రింది లింక్ లు చూడండి 

  • పిల్లల సాఫ్ట్ టాయ్స్ గలేబులు వేసి మూతి బిగించి వాషింగ్ మెషిన్ లో ఉతక వచ్చును. 
  • గలేబులు ఇంకా కొత్తగా కనిపిస్తోనట్లయితే, అలాగే వాడటం బోర్ గా అనిపిస్తే, లేసులు, రిబ్బన్లు, అందమైన పువ్వులు, లతలు, బొమ్మలు కుట్టి కాని, పెయింట్ చేసి కాని, అప్లిక్ చేసి కాని, వాటిని మరింత కొత్తగా కనపడేటట్లు మార్చి వేయండి . 
  • చున్నీలు స్కార్ఫులు వీటిలో వేసి భద్ర పరుచుకోవచ్చును. 
  • అందమైన గాలేబులతో, ఎప్రాన్ కుట్టు కోవచ్చును. 
http://whoopsiedaisiesdays.blogspot.in/2008/06/vintage-pillowcase-cafe-apron-tutorial.html
  • హాంగర్ కి వేళ్ళాడ దీసిన కోట్/చొక్కాలు మొ. దుమ్ము నుండి రక్షించుకోవటానికి,  గలేబుల చివర(అంచులు కుట్టి ఉన్న చోట) హాంగర్ కొక్కెం పట్టే టట్లు ఒక రంధ్రం(కావాలంటే చుట్టూ కాజా కుట్టు కుట్టు కోవచ్చు) చేసి తోడగండి. గలేబు మూతి క్రిందకు రవాలి. ఈ క్రింది లింక్  చూడండి
http://www.bhg.com/decorating/storage/projects/clever-unexpected-storage-solutions/?sssdmh=dm17.547525&esrc=nwdiy090711&email=1237237558#page=6

మరి మీరు కూడా దిండు గలేబుల తో  ఏదైనా చిట్కా చెప్తారా ? నాకు మెయిల్ చేయండి 



మీ...అనామిక....

లక్ష్మి హారం

మీకు ఈ లక్ష్మీ గాజులు గుర్తున్నాయా ?

వీటికి సరి పోయే హారం చాలా కాలంగా వెతుకుతున్నాను . ఇదిగో ఇలా పోడువుగా ఉన్నవి బంగారంలో చాలా ఉన్నయి. ఈ క్రింది లింక్ లో చూడండి. 


పూర్వం మన అమ్మలు, అమ్మమ్మలు వీటిని కాసుల పేర్లు అని ధరించే వారు. ఇప్పుడు మళ్లీ  ఫ్యాషన్. అయితే నాకు అలా పొడువుగా ఉన్న కాసుల పేర్లు కాకుండా ఏదైనా కొత్తగా కొందాం అని అనుకున్నా. ఇదిగో ఇలా. 

ఇది వన్ గ్రాం బంగారంతో చేసినది. ధర తక్కువ. తొందరగా నల్లబడదు. చాలా వెరైటీలు, రకరకాల ధరలలో ఉన్నాయి. మీకు నచ్చిందా ?

మీ...అనామిక....

రంగవల్లి - 154

మిత్రులందరికీ నమస్కారాలు. నాకు ఆరోగ్యం బాగోలేక, ప్రస్తుత్తం బ్లాగ్ లో టపాలు తరచూ వ్రయాలేక పొతున్నాను.  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను.  అయినా  ప్రయత్నం చేస్తాను. 

మీ కోసం ఈ చిన్ని కానుక . 

మరిన్ని వచ్చే టపాలలో ...... 

మీ...అనామిక....